హీరో నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ కథకు స్ఫూర్తి నిజ జీవిత సంఘటనలు, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి. మా అమ్మ ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది. ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి.
ఇందులో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు.ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటంటే ట్రైలర్ కట్ చేయడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత సమయం ట్రైలర్ కి కేటాయించలేం. కానీ నన్ను పర్సనల్‌గా అడిగితే.. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్‌లోకి వెళ్లి ప్రతి మూమెంట్‌కు సర్‌ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ అవ్వడమే ఇష్టం. నా నెక్స్ట్ సినిమాకి సాధ్యమైనంత తక్కువ అప్‌డేట్స్‌తోనే సినిమాని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను. మోహన్ బాబు పాత్ర ఈ కథకి చాలా కీలకం. మోహన్ బాబు, నాని క్యారెక్టర్స్ పేస్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే సంపూ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. అనిరుధ్‌తో పని చేయడం చాలా హాయిగా ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇందులో బిట్స్ సాంగ్స్ కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయి
కంటెంట్ అద్భుతంగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



