Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'హ్యాపీ జర్నీ’కి సూపర్ రెస్పాన్స్

‘హ్యాపీ జర్నీ’కి సూపర్ రెస్పాన్స్

- Advertisement -

అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ హిట్ ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించారు. అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తరుణ్ రెడ్డి సహ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఝాన్సీ మాట్లాడుతూ,’ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే వెళ్లి చూడండి. చాలా మంచి సినిమా చేశాం. మీరందరూ తప్పకుండా చూడాలి. ఎడిటర్ ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి తప్పకుండా హిట్ కొడుతుందని చెప్పారు. అదే నిజమైంది. డైరెక్టర్ అభిరామ్ అద్భుతమైన కథను తీసుకొచ్చాడు. అంతే అద్భుతంగా తీశాడు. ఏడుగురు మహిళలు కలిసి చేసిన సినిమాగా ఇది ఒక పాత్‌బ్రేక్ మూవీ అవుతుంది’ అని చెప్పారు. పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ,’ఈ సినిమాని నా పేరెంట్స్‌తో కలిసి చూడడం చాలా ఆనందాన్నిచ్చింది. చూసిన ఆడియన్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు’ అని తెలిపారు. డైరెక్టర్ అభిరామ్ మాట్లాడుతూ,’సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను అమ్మాయిల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అబ్బాయిల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది’ అని చెప్పారు. వంశీ మాట్లాడుతూ,’ఆడియన్స్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమా చూసిన వాళ్లందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -