పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సినిమా ‘హతః’. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ ను లాంచ్ చేశారు. అసోసియేట్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ,’ఈ సినిమా కంటెంట్ పట్ల గర్వపడుతున్నాం. రెగ్యులర్ గా మనం చూసే సినిమాలకు భిన్నమైన ఒక ప్రయత్నం ఈ చిత్రంతో చేశాం. టీజర్ మీకు బాగా నచ్చిందని నమ్ముతున్నాం. “హతః” థియేటర్స్ లో మీకొక కొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుంది’ అని అన్నారు. ప్రొడ్యూసర్ శివశంకర నాయుడు.వై. మాట్లాడుతూ,’ ఇది అరుదైన సినిమా. ఏ ప్రాంతం వాళ్లు ఈ సినిమా చూసినా అది తమ దగ్గరే జరిగింది అనుకునేలా ఉంటుంది’ అని చెప్పారు.
స్క్రిప్ట్ రైటర్, డీవోపీ, డైరెక్టర్ అనుష్ గోరక్ మాట్లాడుతూ,’ ఈ మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. మిస్టికల్ థ్రిల్లర్ సినిమా ఇది. కొంత హారర్ ఉంటుంది. అన్ని జానర్స్ కలిసి ఉంటాయి. ఈ మూవీ కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి.
అవి థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి’ అని తెలిపారు.కో ప్రొడ్యూసర్, యాక్టర్ కుష్లు మాట్లాడుతూ,’ – మా మూవీ చూసిన వారంతా హాలీవుడ్ మూవీలా ఉందంటున్నారు. టాలీవుడ్ కు అనూష్ లాంటి దర్శకులు కావాలి’ అని అన్నారు. ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’ ఈ సినిమా మాకు ఒక స్పెషల్ ఫిలిం అవుతుందని నమ్ముతున్నాను. థియేటర్స్ లో మీరు ప్రతి సీన్ కు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే సర్ ప్రైజ్ కు లోనవుతారు. సినిమా ఆద్యంతం కొత్త ఫీల్ కలిగిస్తుంది. క్లైమాక్స్ వరకు సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. రాబోయే దీపావళికి మీకు మా మూవీ బెస్ట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది’ అని చెప్పారు.
సర్ ప్రైజ్ చేసే ‘హతః’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



