Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ

అమ్మాపూర్ లో వైభవంగా మైసమ్మ బోనాల పండగ

- Advertisement -

నవతెలంగాణ-నవాబ్ పేట
మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామంలో మైసమ్మ బోనాల పండగను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు.గ్రామ దేవత అయిన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు గ్రామ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తలపై బోనం కలశాలను ఎత్తుకొని, నోట్లో వేపాకులతో శివసత్తులు అవతారం ఎత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.భక్తులు కోరికలు తీరాలని కోడిపుంజులతో మొక్కులు తీర్చుకున్నారు, పసుపు కుంకుమలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.డప్పు వాయిద్యాల నడుమ శివ సత్తుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.బోనం ఎత్తిన శివ సత్తులు లయబద్ధంగా చేసిన నృత్యాలకు గ్రామస్తులు మంత్రముగ్ధులయ్యారు.అమ్మవారి ఆలయాన్ని, గ్రామ వీధులను విద్యుత్ దీపాలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ భోగం. రవణిలసుమన్, ఉప సర్పంచ్ ఎం.ఆంజనేయులు, గ్రామ పెద్దలు అంతయ్య అంకూరి నర్సింహులు పురుగుల నర్సింహులు మాజీ ప్రజాప్రతినిధులు వార్డు సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -