- Advertisement -
సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవతెలంగాణ-మల్హర్ రావు
గర్భిణీలు,బాలింతలు,చిన్నారులు పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే వీలు ఉంటుందని ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి అన్నారు.పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం తాడిచెర్ల ఎస్సికాలని అంగన్ వాడి కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా ఆహార పదార్థాలను ప్రదర్శించి పోషకాహారంపై అవగాహణ కల్పించారు.అంగన్ వాడిల ద్వారా గర్బినిలు,బాలింతలు, చిన్నారులకు పలు రకాల పోషకాహారం అందిస్తూ ఐసిడిఎస్ ఆరోగ్య తెలంగాణకు కృషి చేస్తోందన్నారు.తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ బాలమ్మ,ఆయా,గర్భినిలు,చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -


