Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-టేకుమట్ల
చిట్యాల సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎడ్లపల్లి సతీష్ ను ఆదివారం టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి క్రిష్ణారెడ్డి, సర్పంచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.​ ఈ సందర్భంగా సీఐ సతీష్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ అందించే సేవలకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని సిఐ అన్నారు.

కార్యక్రమంలో టేకుమట్ల మండల సర్పంచుల పోరం అధ్యక్షులు కుర్రె మల్లయ్య యాదవ్, సర్పంచులు నాంపెల్లి వీరేశం, బొడ్డు తిరుపతి,నేరెళ్ల రామకృష్ణ, పేరుమాండ్ల చంద్రకళ మొగిలి, పచ్చిక దిలీప్ రెడ్డి, జక్కుల కుమార్, అంబాల కిరణ్, వంగ మమత శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మోతే రాజమౌళి, మాజీ ఎంపీటీసీ సంగి రవి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బండ రగోతం రెడ్డి, అందె కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -