- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో భారీగా గంజాయి చాక్లెట్లను శనివారం పోలీసులు పట్టుకున్నారు. 5వేలకు పైగా గంజాయి చాక్లెట్లను ఈ సందర్భంగా పోలీసులు సీజ్ చేశారు. వీటిని బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి అమ్ముతున్నట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. పాన్‌షాప్ ముసుగులో చిన్నారులు, యువతను లక్ష్యంగా చేసుకొని ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు.
- Advertisement -



