Friday, September 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమసీదులో బాంబు పేలుడు..15 మంది మృతి

మసీదులో బాంబు పేలుడు..15 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వాయువ్య పాకిస్థాన్‌లోని ఒక మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మరణించగా, 56 మంది గాయపడ్డారని సమాచారం. పోలీసు కార్యాలయాలు ఉన్న భవనం సమీపంలో ఈ దాడి జరగడంతో, మరణించిన వారిలో ఐదుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఒక దుండగుడు మసీదులోకి దూసుకెళ్లేలా చేశాడని ఆ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ జుల్ఫికర్ హమీద్ తెలిపారు. ఈ దాడి కారణంగా పోలీస్ కార్యాలయాల బయటి గోడ కూలిపోగా, మసీదు తీవ్రంగా దెబ్బతింది. బాంబు దాడిలో గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -