Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలసదనం హాస్టల్ ను సందర్శించిన అదనపు కలెక్టర్

బాలసదనం హాస్టల్ ను సందర్శించిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేట పట్టణంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాలసదనం బాలికల వసతి గృహాన్ని శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం సందర్శించారు. ఇందులో భాగంగా వివిధ రికార్డులను పరిశీలించారు. హాస్టల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన విలువలతో జీవనం గడపాలని విద్యార్థులకు సూచించారు. ఏ ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, పదవ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలు ప్రస్తుతం ఏం చేస్తున్నారని సూపరిడెంటెడ్ భాగ్యమ్మను అడిగి తెలుసుకున్నారు. ఆసక్తి గల పిల్లలకు వృత్తి విద్యలపై స్కిల్స్ నేర్పించాలని, కంప్యూటర్ డేటా ఎంట్రీ విధానం, టైలరింగ్ ఇతర స్కిల్స్ నేర్పించాలన్నారు. సాధారణ విజిట్ లో భాగంగా హాస్టల్ ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అరుంధర్ రావు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -