- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంధన కొనుగోళ్లపై కొత్తగా ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) భారాన్ని ఉపసంహరించుకోవాలని, లేదా పెట్రోల్ పంపులకు మినహాయింపు ఇవ్వాలని పెట్రోల్ డీలర్లు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమకు మినహాయింపు ఇవ్వకపోతే, రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే యూపీఐ డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి, కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతిస్తామని వివిధ రాష్ట్రాల పెట్రోలియం డీలర్లు స్పష్టం చేశారు.
- Advertisement -



