Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

- Advertisement -

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ 
నవతెలంగాణ-సంగారెడ్డి 

తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో డిగ్రీ విద్యార్థులకు బోధించుటకు వివిధ విభాగాలలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం జరుగుతున్నదని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. తారా కళాశాలలో బీ.బి.ఏ. రిటైల్ ఆపరేషన్స్ లో ఒకటి, బి సి ఎ (కంప్యూటర్  అప్లికేషన్స్ ) ఒకటి; పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 55% మార్కులతో పాసై ఉండాలని, ఎస్సీ ,ఎస్టీ, అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని, అనుభవము మరియు నెట్, స్లేట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తారా కళాశాలలో ఈనెల 19వ తేదీన జరిగే డెమో మరియు ఇంటర్వ్యూ కు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక జిరాక్స్ సెట్ కాపీల తో అటెండ్ కావాలని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -