విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట..
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ-నవాబ్ పేట్
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న షూ, టై, బెల్ట్‌లను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, యూనిఫాం, షూ తదితర సామగ్రిని ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం నవాబ్‌పేట, దయాపంతులపల్లి, అజిలాపూర్, కొండాపూర్, రుద్రారం, కాకర్ల పహాడ్, తీగలపల్లి, సిద్ధోటం, కారుకొండ కూచూర్, హన్మసానిపల్లి, కారూరు, ఇప్పటూర్, చెన్నారెడ్డి పల్లి యన్మంగండ్ల తదితర గ్రామాల్లోని నిరుపేద, అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజల సంక్షేమం, విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో తహశీల్దార్ సురేష్, ఎంఈఓ నాగ్య నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం ముదిరాజ్ మండల అధ్యక్షుడు తాణెం సుధాకర్, సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి, ఉపసర్పంచ్ హజహర్ అలీ, అంబదాస్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్లు కమలమ్మ, లక్ష్మమ్మ రాజు, రవిందర్, బాలయ్య, లక్ష్మమ్మ, నారాయణ, నవనీత, రవి యాదవ్, మల్లేష్ గౌడ్, రవికిరణ్, రంజిత్ కుమార్ గౌడ్, రాములు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు జీపీఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్టి అంజయ్య, భూపాల్ రెడ్డి, తాణెం రాజు, బాగరి నర్సింహులు, వాసు, మైనోద్దీన్, రవిందర్ రెడ్డి, చింతకింది సురెందర్ కోట్ల రాజేష్, సత్యం, చౌడూర్ శ్రీనివాస్, కొల్లి నర్సింహులు, ఉమర్, నీలకంఠ, గోపాల్, బాలయ్య, బంక వెంకటయ్య, నరెందర్, ఆంజనేయులు, రాజు, అశోక్, నరేష్, కాటమయ్య, ఆశన్న, మాదవులు, ఆయా గ్రామాల కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



