Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్షా బంధన్ వేడుకల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్

రక్షా బంధన్ వేడుకల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సహచర కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు శనివారం రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్షా బంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలోని ప్రతి కుటుంబంలో సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావం సమాజంలో మరింత పెంపొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజాద్, బబ్లు, మజీద్, జావేద్, సాయిలు సిద్ధిక్, చిట్టిబాబు, కళ్లెం సత్యం, యూనస్, అస్రార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -