Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైసమ్మ దేవాలయ లడ్డూ, పులిహోర బహిరంగ వేలం 

మైసమ్మ దేవాలయ లడ్డూ, పులిహోర బహిరంగ వేలం 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మైసమ్మ దేవాలయ అమ్మవారి దేవస్థానానికి వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రసాదమైన లడ్డు పులిహోర తినుబండారాలు సంబంధించి గతంలో వేలం అక్టోబర్ 12వ తేదీకి ముగిసిన సంగతి తెలిసిందే. నేడు కొత్తగా మరో సంవత్సరం పాటు లడ్డు పులిహోర తినుబండారాల సంబంధించి వేలం నూతనంగా బహిరంగ వేలం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి, గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేలంలో పాల్గొన వలసిన వారు రూ.3 లక్షలు డిపాజిట్ చేసి డీడీతో పాటు వేలంలో పాల్గొనవలసిందిగా సూచించారు. వేలంపాటలో దక్కించుకున్న వారు లడ్డుకు 100 గ్రాముల బరువుకు రూ.20 చొప్పున అమ్మాలని, పులిహోర 200 గ్రాముల బరువుకు రూ.20 చొప్పున అమ్మాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. వేలం పాటలో పాల్గొని హెచ్చు పాటదారులు 48 గంటలలోపు 100% సొమ్ము దేవస్థానానికి ఇచ్చి అగ్రిమెంట్ చేయవలెనని, లేనియెడల వేలం పాట పాడిన వారు డిపాజిట్ రద్దు చేసి, మరోసారి బహిరంగ వేలం మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగుతుందని తెలిపారు. నిబందనలు ఉల్లంఘిస్తే ఆలయ కార్య నిర్వహణ కమిటీ చర్యలను కట్టుబడి ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -