నవతెలంగాణఆలేరు-టౌను
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతకి ఆటంకం కల్పించి, ఉద్రిక్త పరిస్థితులకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆలేరు పట్టణంలో మంగళవారం పోలీస్ స్టేషన్లోఎస్ హెచ్ ఓ ఉదయ్ కిరణ్ కు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ముఖ్యమంత్రి చావు కోరుతూ, చావు డప్పు కొడుతూ దళితులతో ఫామ్ హౌస్ పై దాడి చేయడానికి ఉసిగొలిపినందున, వారికి భద్రత కల్పించాలని, ఉద్రేక పూరిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి, శాసనసభ్యులు వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వివరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్, టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్, కౌన్సిలర్ శివ, మాజీ కౌన్సిలర్ భేతి రాములు, మాజీ జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ బాలస్వామి, బింగి రవి, రామన్, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.


