నవతెలంగాణ-మిడ్జిల్
రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిట్టడం అంటే దళిత సమాజాన్ని అవమానించినట్లనీ, ఎమ్మెల్సీ తాత మధును బర్తరఫ్ చేసి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, ఉమ్మడి మండల జేఏసీ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు చెన్నయ్య ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జడ్చర్ల, కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ మధుసూదన్ రావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు దాటిన ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న, రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న కూడా, అస్పృశ్యతకు దళితులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితుల పట్ల ఇంకా మానసిక, అస్పృశ్యత ఇంకా కొనసాగించడం చాలా బాధాకరమని విమర్శించారు. స్పీకర్ అంటే ఓ కులానికో, మతానికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదని అన్ని వర్గాల అగ్రవర్ణ రాజకీయ పార్టీల నాయకులు గమనించాలని సూచించారు. దళిత సమాజం తిరగబడితే ఎంతటి వారినైనా ఎదుర్కొనే శక్తి ఉందని ,దళితుల చరిత్ర తిరుగుబాటు చరిత్ర ఆత్మగౌరవం చరిత్ర అని పేర్కొన్నారు. ఎంత ఎదిగిన ఎక్కడో ఒకచోట అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి రాజ్యాంగపరమైన అత్యున్నత పదవుల ఉండి కూడా స్పీకర్ అవమానానికి గురి కావడం దళితుల రక్తం ఉడికిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించామనే పచ్యుతాప్తం బిఆర్ఎస్ నాయకుల్లో కనిపించడం లేదని విమర్శించారు.
నాయకులకు పదవులు రావచ్చు, పార్టీలు మారొచ్చు, ఒక తల్లిని అవమానించే స్థాయికి రాజకీయ నాయకుల దిగజారడం మాత్రం ధారణమని విమర్శించారు. దళిత సమాజానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత వర్గాల సత్తా ఏమిటో రాబోవు రోజుల్లో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులకు చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, జంగయ్య, మల్లికార్జున్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సత్యం గౌడ్, బంగారు, రామ్ గౌడు, భాస్కర్ నాయక్, జహీర్, ఆదాము, రమేష్ , బుచ్చమయ్య, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



