Monday, August 17, 2026
E-PAPER
Homeసినిమా‘ఫైట్ మహా’ ట్రైలర్ రిలీజ్

‘ఫైట్ మహా’ ట్రైలర్ రిలీజ్

- Advertisement -


సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యం గార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఫైట్ మహా’. కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా గత నెల విడుదల చేసిన టీజర్ అద్భుతమైన స్పందన వచ్చింది. మిలియన్ ప్లస్ వ్యూస్ తో ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ఇదే ఉత్సాహంతో సోమవారం 2 నిమిషాల 20 సెకండ్స్ నిడివిగల ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం ఈనెల 21 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రొడ్యూసర్ ఏవీఎస్ రాజు మాట్లాడుతూ,‘దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ కథ చెప్పినప్పుడు మా అందరికీ బాగా నచ్చింది. కథే ఈ సినిమా నిర్మించేందుకు మమ్మల్ని ఇన్స్ పైర్ చేసింది. డైరెక్టర్ మాకు కథ ఎంత బాగా చెప్పాడో అంతే బాగా రూపొందించాడు. వైజాగ్, కేరళ, హైదరాబాద్లో ఈ సినిమాను చిత్రీకరించాం.ఈ సినిమా పోస్టర్ లో కేవలం ఇద్దరు సునీల్, అఖిల్ ఉడ్డెమారి కనిపించినా షుమారు 40 మంది నటీ నటులు అలరించ నున్నారు’ అని అన్నారు.
‘మేము చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా వుంటుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినా, మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రంలోని కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని నమ్మకం ఉంది. ఈ చిత్రం ఒక వినూత్నమైన సైకలా జికల్‌ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, ఎక్కడో దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ’ అని డైరెక్టర్ ఆనంద్ చంద్ర చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -