Wednesday, September 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅసెంబ్లీ ఘటన కాకతాళీయం కాదు.. ఫామ్‌‌హౌస్‌ కుట్ర

అసెంబ్లీ ఘటన కాకతాళీయం కాదు.. ఫామ్‌‌హౌస్‌ కుట్ర

- Advertisement -

యావత్‌ తెలంగాణ సమాజ సంస్కారానికి దెబ్బ
తాతా మధు, నవీన్‌‌కుమార్‌‌రెడ్డి ప్రవర్తనపై సభలో ఆగ్రహం
ఒక్క స్పీకర్‌‌కే కాదు.. సభ మొత్తానికి అవమానమని వ్యాఖ్య
ఎమ్మెల్సీలపై కఠిన చర్యల తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

శాసనసభ ప్రాంగణంలో జరిగిన ఘటన కాకతాళీయం కానేకాదనీ, ఇది బీఆర్‌ఎస్‌ ‌భావజాలం ప్రకారం ఫామ్‌‌హౌస్‌ ‌చేసిన కుట్ర అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు చేసిన దురుసు వ్యాఖ్యలు ఒక్క స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌ను ఉద్దేశించినవే కాదనీ, యావత్‌ ‌తెలంగాణ సమాజానికి వర్తిస్తాయని చెప్పారు. స్పీకర్‌‌ను అవమానించడమంటే ఒక వ్యక్తిని అవమానించినట్టు కాదనీ, సభ మొత్తాన్ని అవమానించినట్టేనని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఎమ్మెల్సీల తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఇంకా భూస్వామ్య భావజాలాన్ని వీడలేదని చెప్పడానికి ఇదొక సాక్ష్యం అని స్పష్టం చేశారు. మంగళవారం ప్యానెల్‌ ‌స్పీకర్‌ ‌కడియం శ్రీహరి అధ్యక్షతన ప్రారంభమై శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌పై ఎమ్మెల్సీలు తాతా మదు, నవీన్‌‌కుమార్‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ చేపట్టింది. ఈసందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎమ్మెల్సీల తీరును నిరసించారు. కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చను ముగిస్తు డిప్యూటీ సీఎం మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ‌కాలంలోని నిబంధనల ప్రకారం అసెంబ్లీని నడుపుకుంటున్నామని వివరించారు. చట్టసభలు అంటే అత్యంత పవిత్రమైనవనీ, దేవాలయంగా భావిస్తామని గుర్తు చేశారు. ఈ చర్చ కేవలం దళితుల కోసమే కాదనీ, మొత్తం సభ కోసం చెప్పారు. సభాపతిని అంటే సభను అన్నట్టేనని వివరించారు. సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం సభాపతికి, సభకు ఉంటుందని తెలియజేశారు. అమానుషమైన కార్య్రకమాలు చేయడం బీఆర్‌ఎస్‌‌కు అలవాటైందన్నారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ వచ్చిందనే సంగతిని మరిచిపోవద్దని గుర్తు చేశారు. అదే ఒరవడి కొనసాగితే మరిన్ని పోరాటాలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠకలో పేర్కొన్న అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు ప్రమాదకరంగా తయారయ్యారని అన్నారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని 2014-2023 వరకు చేసిన పరిపాలనలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే చెప్పిందని వివరించారు. వాడు, వీడు స్పీకర్‌ గాడు అంటూ రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తారా ?అంటూ ప్రశ్నించారు. సభాపతి గారి తల్లీ‌ అంటే అందరికీ తల్లే కదా అని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూల్చేస్తున్నారనీ, భూస్వామ్య ఆలోచనతో కుట్ర, ఉక్రోషంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అమానుషంగా, అహంకారంతో స్పీకర్‌పై మాట్లాడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలపై సభ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ స్పీకర్‌‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మల్సీలు చేసిన వ్యాఖ్యలను శాసనసభ ఖండిస్తున్నదని చెప్పారు. సభా మర్యాదలకు విరుద్ధమైన వ్యాఖ్యలపై నిరసన నమోదు చేస్తున్నదని వివరించారు. ఈ ఇద్దరు సభ్యులుమఈ ఇద్దరు సభ్యులు మహిళల ఎదుట చొక్కాలు విప్పి అనుచితంగా, అసభ్యకరంగా, సమాజం తలదించుకునేలా ప్రవర్తించడాన్ని కూడా ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి ప్రవర్తన శాసన మండలి సభ్యుని హోదాకు ఏమాత్రం తగదనీ, శాసనసభాపతి గౌరవం, అధికారం రాజ్యాంగబద్ధ హోదాకు తీవ్ర భంగం కలిగించిందని ఈ సభ భావిస్తున్నదన్నారు. ఇది తెలంగాణ శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా ఈ సభ పరిగణిస్తున్నదని తెలిపారు.

రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే, సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని ఈ సభ స్పష్టం చేస్తున్నదన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటాన్ని సహించేది లేదని సభ అభిప్రాయపడుతుంది. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు బాధ్యత స్వీకరించి, ఈ సభ హుందాతనం, సభా మర్యాదలను పరిరక్షించేందుకు, శాసన సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సభ తీర్మానిస్తున్నది. అలాగే తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి సభ్యులుగా కావడంతో ఈ తీర్మానం ప్రతితో పాటుసభ ముందు ఉంచిన ఆధారాలు, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, వాటికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను తెలంగాణ శాసనమండలి చైర్మెన్‌‌కు పంపించాలని ఈ సభ తీర్మానిస్తున్నదని వివరించారు. ఈ అంశంపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మెన్‌ ‌తదుపరి చర్యలు తీసుకోవాలని ఈ సభ కోరుతున్నదని చెప్పారు. అంతకుముందు శాసనసభ్యులు దానం నాగేందర్‌, సత్యం, యశస్వీనిరెడ్డి, ఎమ్మెల్యే రాగమయి తదితరులు తీర్మానంపై మాట్లాడారు. అలాగే మంత్రి శ్రీధర్‌‌బాబు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నియమావళినే అమలుచేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ అనుమతి మేరకే సభలో ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. సభలో ఎలా వ్యవహరించాలో సభ్యులు మార్గదర్శకాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎంఐఎం సూచనలను తప్పకుండా పాటిస్తామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -