Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్పీకర్‌ ప్రసాద్‌‌కుమార్‌‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం

స్పీకర్‌ ప్రసాద్‌‌కుమార్‌‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం

- Advertisement -



నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎదుట సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌ను ఆయన ఛాంబర్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం పరామర్శించారు. స్పీకర్‌‌ను ఓదార్చారు. సోమవారం జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ఏకంగా స్పీకర్‌‌నే అసభ్యకర పదజాలంతో దూషించి.. మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారని తెలిపారు.

ఎమ్మెల్సీ తాతా మధు రాజీనామా చేయాలి
కాంగ్రెస్ ధర్నా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోతా రోహిత్ ముదిరాజ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలు అవమానకరమైన, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఖండించారు. అలాంటి భాష వాడటం స్పీకర్ పదవి గౌరవానికి భంగం కలిగించడమేనని అభ్యంతరం తెలిపారు. వారిద్దరు రాజీనామా చేయాలనీ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి గౌరవ మర్యాదలను కాపాడేలా ప్రజా ప్రతినిధులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు.

‌స్పీకర్‌పై ఎమ్మెల్సీ 
తాత మధు వ్యాఖ్యలను ఖండించండి
రాజ్యాంగ పదవుల్లో ఉండి వ్యక్తిగత దూషణలేంటి? : కేవీపీఎస్‌
శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కేవీపీఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉండి తాతా మధు అలా మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలను చర్చించకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలపై ఏమాత్రం చర్చ జరగకుండా ఒకరికొకరు పరోక్షంగా సహకరించుకుంటున్నారని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్ గురించి అసెంబ్లీలో చర్చ చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు అంబేద్కర్ అభయహస్తం రాజీ యువశక్తి పథకం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి , కులాంతర వివాహితుల పెండింగ్ ప్రోత్సాహకాలు, ఎస్సీ ఎస్టీ కేసులలో పెండింగ్ ఎక్స్ గ్రేషియో లు వంటి అనేక అంశాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలని కోరారు. భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా అలా మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలను రేవంత్‌‌రెడ్డి సర్కారు అణచివేయడాన్ని తప్పుబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -