Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి

- Advertisement -

యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
సోమశీల సిద్దేశ్వరం బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
నవ తెలంగాణ -కొల్లాపూర్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 22ఏ నిషేధిత జాబితా నుండి భూములను తొలగించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో సోమశిల గ్రామంలో మయూరికాలో సీపీఐ(ఎం) నాగర్ కర్నూల్ జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా తీగల సాగర్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. అధికారంలోకి రావడం కోసం పాలక పార్టీలు అనేక ఉచిత హామీలు ఇచ్చి నిరుద్యోగులు, ప్రజల్ని నమ్మించి మోసం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పాలమూరు రంగారెడ్డి, మిషన్ భగీరథ, కేఎల్‌ఐ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ లో మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్‌ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 22 ఏ పేరుతో విలువైన భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచి పేదల పొట్టలు కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్, బి ఆంజనేయులు, సి ఆంజనేయులు, కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివ వర్మ, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, శ్రీనివాసులు, బాలస్వామి, శంకర్ నాయక్, నిర్మలమ్మ, అశోక్, తారా సింగ్, పొదిల్లారామయ్య, మల్లేష్, అంతటి కాశన్న, నాగరాజు, హనుమంతు, సైదులు, మధు, భాస్కర్, నాయకులు ఎండి సలీం, బి బాల పీర్, రామకష్ణ, రాజు, కిరణ్ కుమార్, సంజీవ్, సాయికుమార్, పవన్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -