Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీలో ప్రజాసమస్యలు గాలికి

అసెంబ్లీలో ప్రజాసమస్యలు గాలికి

- Advertisement -

దౌర్జన్యాలు..బూతులతో కాలయాపన సిగ్గుచేటు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‘అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించకుండా గాలికి వదిలేయడం దారుణం. అసెంబ్లీ గేటు ముందు నిరసన తెలుపుతున్న బీఆరఎస్ మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు నెట్టివేయడం, చీరలు లాగడం, మెడను పట్టి నెట్టడం, జుట్టు పట్టి లాగడం వంటి ఘటనలు అత్యంత హేయనీయం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ ‌తల్లిని ఉద్దేశించి సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేయడం మరింత బాధాకారం. ఈ ఘటనలను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ప్రవర్తించిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శాసనసభ్యులు, నాయకులందరూ రాష్ట్ర ప్రజానీకానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ ఘటనలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో విద్యా, వైద్యం వ్యాపారంగా మారింది. ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నామమాత్రమైంది. రేషన్‌కార్డులపై 14 రకాల సరుకులు ఇస్తామన్న హామీ, పెన్షన్ల హామీలు అమలు జరగడంలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, కూలీలకు పని, కార్మికులకు కనీస వేతనం అమలు జరగాలని ఆందోళనలు జరుగుతున్నా దీనిపై చర్చే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల సంక్షేమానికి తగిన నిధుల లేమి వల్ల సమస్యలు పరిష్కారం జరగడం లేదు’ అని ఎత్తిచూపారు. ‘అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరిపై ఒకరు బూతులతో దూషించుకుంటూ సభ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించకుండా, అర్ధవంతమైన చర్చలు జరపాలని అధికార, ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో ఇరు పార్టీలకు రాష్ట్ర ప్రజానీకం తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది’ అని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -