Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌టీషర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయనే పోలీసులు అడ్డుకున్నరు

‌టీషర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయనే పోలీసులు అడ్డుకున్నరు

- Advertisement -

ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలను కేసీఆర్‌ ఎందుకు
ఖండించలేదు? : టీపీసీసీ అధ్యక్షులు బి.మహేశ్‌‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధరించిన టీషర్టులపై అభ్యంతకర వ్యాఖ్యలున్నాయనే పోలీసులు అడ్డుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను పదేండ్ల పాటు సీఎంగా చేసిన కేసీఆర్‌ ఇప్పటిదాకా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రనిధులతో చిట్‌‌చాట్‌ ‌చేశారు. ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలను తాను వినలేదన్నారు. దళితులకు కాంగ్రెస్ లో అత్యున్నత పదవులు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్ష నేత హోదా పదవి నుంచి భట్టి విక్రమార్కను తొలగించారని ‌గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనలో దళిత నేత, డిప్యూటీ సీఎం రాజయ్యను అర్థరాత్రి బర్తరఫ్‌ ‌చేశారని తెలిపారు. కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఫెయిల్‌ అయినందుకే ప్రజలు ఆయన్ను ఇంటికి పంపారన్నారు. బీఆర్‌ఎస్‌ ‌స్రిప్టునే తాతా మధు మాట్లాడారనీ, స్టాటజీ ఫ్రెమ్ చేసి ఆయన్ను పంపారని విమర్శించారు. మహిళా మంత్రి లేకుండా క్యాబినెట్‌‌ను నడిపిన వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. పదేండ్లలో కేసీఆర్‌ ఏనాడూ అంబేద్కర్‌ ‌విగ్రహానికి దండ వేయలేదని ఎత్తిచూపారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అధ్యక్షా అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీ రావట్లేదని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నేత పామ్‌‌హౌస్‌‌లకు పరిమితం కారన్నారు. 22 ఏను సీఎం రేవంత్‌‌రెడ్డి సమూలంగా సవరించాలనుకుంటున్నాడని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అభ్యర్థుల వడ పోత జరిగిందనీ,
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ నియోజకవర్గానికి నాలుగు పేర్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ కు కూడా నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయనీ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజక వర్గాన్ని దామోదర్ రాజనర్సింహ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రెండు మూడు రోజుల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యే అవకాశముందని తెలిపారు. రెండోసారి సమస్యను క్లోజ్‌ ‌చేసుకోవాలని కొండా సురేఖకు చెప్పానని, తాను మంత్రిని కావాలని కోరులేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే తమందరి ఆకాంక్ష అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -