- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్: 22/ఎను భూతంగా చూపించి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిషేధిత భూముల అంశంపై రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి,సంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ లు, అడిషనల్ కలెక్టర్ లు, ఆర్, డి. ఓ, సబ్ రిజిస్టర్ లతో సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం, చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చడం ఇకపై సహించేది లేదన్నారు. ప్రజల సమస్యను పరిష్కరించడం అధికారుల బాధ్యత అన్నారు.
నిజమైన భూ హక్కుదారుడికి న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని సూచించారు.ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన మంత్రి హెచ్చరించారు.22-Aలో భూమి ఉందనే ఒక్క కారణంతో ప్రజలను తిరస్కరించకూడదు. ఆ భూమి ఎందుకు నిషేధిత జాబితాలోకి వచ్చింది, సంబంధిత రికార్డులు ఏమి చెబుతున్నాయో,వాస్తవ పరిస్థితి ఏమిటో సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారుకలకు సూచించారు.



