Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeసినిమానేత్రదానం స్ఫూర్తిదాయకం

నేత్రదానం స్ఫూర్తిదాయకం

- Advertisement -

తాను మరణించినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని అలనాటి మేటి నటి, అభినయ సరస్వతి బి.సరోజాదేవి చేసిన నేత్రదానం ఆమె మంచి మనసుకు ప్రతీకగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
సరోజాదేవి రెండు కార్నియాల పనితీరు బాగుంది. అవసరమైనవారికి త్వరలోనే వాటిని ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తామని బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు తెలిపారు.
తాను చనిపోయినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని సరోజాదేవి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేత్రదానం చేసేందుకు ఐదేళ్ళ క్రితం నారాయణ నేత్రాలయలోని డా.రాజ్‌కుమార్‌ ఐ బ్యాంక్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఆమె కోరికను కుటుంబ సభ్యులు నెరవేర్చారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించిన సరోజాదేవి వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యతో సోమవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుతో సరోజాదేవి పుట్టిన దసవరా గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం తనయుడు గౌతమ్‌ అంత్యక్రియలను నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad