– కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు
– కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా?
– కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు : హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పాలమూరు రైతులను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కల్వకుర్తి, కన్నెపల్లి లిప్టులను ఎప్పుడు ఆన్ చేయాలో తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని తెలిపారు. కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలని తమకు సలహా ఇస్తున్నారా? అని హరీశ్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతు న్నారని విమర్శించారు. అబద్ధాలు, అసత్యాలు మాట్లాడటంలో హరీశ్ గోబెల్స్‌ను మించిపోయారని ఉత్తమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట వేసేటప్పుడు రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ప్రతి పంట సీజన్‌లో రైతులను ఆందోళనకు గురి చేసి, గందరగోళపరచాలనే దుర్భుద్ధి ఆయనలో కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుడు వానాకాలంతోపాటు ఇటీవలి యాసంగిలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని మరిచి పోయి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్‌కు ముందు కూడా బీఆర్‌ఎస్ నేతలు ఇలాంటి దుష్ప్ర చారం చేశారని విమర్శించారు. ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ నేతలు చేసిన తప్పులు, దుర్మార్గాలకు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, కల్వకుర్తి ఎత్తిపోతల పేరిట రైతులను మోసం చేయాలనుకోవడం సరైందికాదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ సర్కారు అస మర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని తెలి పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా తరలించేం దుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపిం చారు. అప్పుడే ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు కెపాసిటీని కూడా 88వేల క్యూసెక్కు లకు పెంచిందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్, ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీటిని ఏపీకి తీసుకపోయేం దుకు బీఆర్‌ఎస్ దొంగచాటుగా సహకరిం చిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతు బంధు ఎకరానికి రూ.5వేలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నదని గుర్తుచేశారు. ఇప్పటికైనా హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
పాలమూరు రైతుల నుమోసం చేసే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES