Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..

- Advertisement -

17 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు..
నవతెలంగాణ – జన్నారం
: జన్నారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2007-2008 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది.చిన్ననాటి స్నేహితులు ఒకే వేదికపై చేరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ.. ఆనాటి జ్ఞాపకాలను, తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.ఈ సందర్భంగా మిత్రులు అలనాడు చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయి. అటాపాటలతో సందడి చేశారు. అనంతరం అప్పటి గురువులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పూర్వ గురువులు మాట్లాడుతూ.. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరం ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. అనంతరం విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయ, విజయలక్ష్మి, లక్ష్మీ ,సుధారాణి, సునీత ,కవిత కుమారి, అంజలి లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad