Wednesday, April 30, 2025
Homeజిల్లాలుపెట్రోల్, డీజిల్, ధరలు వెంటనే తగ్గించాలి: సీపీఐ(ఎం) డిమాండ్

పెట్రోల్, డీజిల్, ధరలు వెంటనే తగ్గించాలి: సీపీఐ(ఎం) డిమాండ్

నవతెలంగాణ – జుక్కల్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్. సిలిండర్ పై 50 రూపాయల పెంచడం దారుణం అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ విమర్శించారు. దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారులతోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలు ఉపసంహరించుకునే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అన్ని రకాల. సరుకులు. వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అధికారంలో వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధర. పెట్రోల్ డీజిల్ ధరలు. విపరీతంగా పెంచినది అని అన్నారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలు ఉండేదని ఇప్పుడు బిజెపి వచ్చిన తర్వాత వేయి రూపాయల కి గ్యాస్ సిలిండర్ ధర పెంచడం చాలా దారుణమైన విషయం అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్. పెట్రోల్. డీజిల్. ధరలతో పాటు. నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగ పోరాటాలు చేయవలసిన అవసరం వస్తుందని సురేష్ గొండ. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img