Monday, May 26, 2025
Homeట్రెండింగ్ న్యూస్బ‌ల‌గం న‌టుడు క‌న్నుమూత‌..

బ‌ల‌గం న‌టుడు క‌న్నుమూత‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ క‌మెడీయ‌న్ వేణు తెర‌కెక్కించిన బ‌ల‌గం సినిమాలో కీల‌క పాత్ర పోషించి అల‌రించిన జీవీ బాబు అనారోగ్యంతో క‌న్నుమూసారు. బ‌ల‌గం చిత్రంలో హీరో ప్రియ‌దర్శి చిన్న తాత అంజ‌న్న పాత్ర‌లో న‌టించి అల‌రించారు గత కొంత కాలం నుంచి జీవీ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం వ్య‌క్తం చేస్తూ.. బాబు మొత్తం జీవితం నాటకరంగంలోనే గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు. బాబు మృతి గురించి తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు

రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇందులో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు జీవీ బాబు. కొద్ది రోజుల క్రితం బలగం సినిమా నటుడు మొగిలయ్య కూడా అనారోగ్యంతో క‌న్నుమూసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -