Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుమండుతున్న ఎండలు..

మండుతున్న ఎండలు..

- Advertisement -

ముందు జాగ్రత్త మేలు..

మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడిగాలులు,

ఉదయం 10 నుండే బయటకు వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు

జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా, సురక్షితం…..

శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.లక్ష్మీరెడ్డి..

నవతెలంగాణ కంఠేశ్వర్

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి పలకరించింది. మార్చి నెల ఆరంభం నుంచే బాణుడు ప్రతాపం చూపుతున్నాడుఎండలో పనిచేసేవారు, అవసరం నిమిత్తం బయటకు వెళ్లేవారు బయటకు వెళ్లాలన్న పనులు చేయాలన్న చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండలో పనిచేసే వారికి ఎండ దెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సాధారణంగా మే నెలలో కనిపించాల్సిన ఎండల తీవ్రత, ఈసారి మార్చి మొదటి వారంలోనే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గత ఆదివారం 38 డిగ్రీలు దాటింది. అయితే ఈ గురువారం 36.8/22.0 ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వేడి తీవ్రత ఎక్కువగానే ఉంది. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉక్కపోత పెరిగి, జనం అల్లాడిపోతున్నారు. రానున్న మూడు నెలలు ఎండలు ఎలా ఉంటాయో చూడాల్సిన పరిస్థితి ఉంది.

రోజురోజుకు ఎండలు పెరుగుతూ తగ్గడం ఉండడంతో జనం ఎండ తీవ్రతకు వేడికి అల్లాడిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజుల్లో ఎండను తట్టుకోలేక అత్యవసర పరిస్థితులో బయటకు వెళ్లాల్సిన వారు వర్షాకాలంలో వాడవల్సిన గొడుగులను ఎండ తాకిడి తగలకుండా గొడుగులు పట్టుకొని బయిటికి వెళ్లుతున్నారు. దీంతోపాటు తలపై పాగచుట్టుకొని, టోపీలు పెట్టుకొని, టవలను కప్పుకొని, చీర కొంగును కప్పుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
అంతేకాకుండా మార్చి కాకముందే ఎండలు, తీవ్రమైన వేడితో ప్రారభమైంది. గతంలో మార్చి 1 నుంచి మార్చి రెండవ లేదా మూడవ వారం వరకు చలిని తట్టుకోలేక జనం స్వెటర్లు, జాకెట్లు ధరించేవారు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవ వారం నుంచే ప్రజలు తమ స్వెటర్లు, జాకెట్లను దూరం పెట్టారు. ప్రస్తుతం మార్చి 1 నుండి మండే ఎండలు ప్రారంభమయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా తీవ్రమైన వేడిని ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలోనే మార్చి 1 నుంచి వాతావరణం చాలా వేడిగా మారిపోయింది. వాతావరణ కూడా ఈ సంవత్సరం ఎండలు విపరితంగా ఉంటాయని ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సెంటర్లో వెలిశాయి. ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఎండలో ప్రయాణాలు చేసినప్పుడు సెంటర్ల వద్ద వచ్చి చల్లని పానీయాలను సేవిస్తూ తనివి తిరుగుతున్నారు.

వారం రోజులుగా నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి..

శుక్రవారం 37.3/18.7

శనివారం 37.6/19.7

ఆదివారం 38.2/20.8

సోమవారం 37.8/20.8

మంగళవారం 37.4/21.9

బుధవారం 36.2/21.8

గురువారం 36.8/22.0

ఎండకు జాగ్రత్తలు వహించాలి

జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా, సురక్షితం…..

శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.లక్ష్మీరెడ్డి..

వేసవి కాలంలో వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి తగినంత నీరు రోజుకు 8 గాస్లుల నుండి 10 గ్లాసుల వరకు తాగాలని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.లక్ష్మీరెడ్డి ప్రజలకు సూచించారు.వేసవిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ, వేడి వల్ల సంభవించే వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు ఉష్ణోగ్రతలు పెరుగడంతో చర్మ వ్యాధులు, వడదెబ్బ, డీ హైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

నీటిని బాగా తాగడంతోపాటు చలువ కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. శరీర నీటి శాతం పెంచే పుచ్చ, కర్బూజను బాగా తినాలి. మజ్జిగ బాగా తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తెల్లటి కాటన్ దుస్తులు, టోపీలు ధరించాలని, మసాలా, వేపుడు పదర్థాలకు దూరంగా ఉండి, దోసకాయ, పుచ్చకాయ వంటి జలశాతం ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండవచ్చు. వేసవి కాలంలో పైన తెలిపిన జాగ్రత్తలు వహించడమే కాకుండా వడదెబ్బ, డీహైడ్రేషన్ కాగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని సొంత చికిత్సలు చేసుకొని ఇబ్బందులు పడవద్దని శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.లక్ష్మీరెడ్డి ప్రజలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -