నవతెలంగాణ – భిక్కనూర్
బిఆర్ఎస్ పార్టీ ఆదివారం వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో నిర్వహించిన తెలంగాణ రథతోత్సవ సభలా లేదని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే సభల ఉందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి కుటుంబ పాలన చేస్తూ అమాయక ప్రజలను మోసం చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఆశ చూపి బిఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నారని గ్రహించిన ఓడించి గుణపాఠం చెప్పిన మళ్లీ అధికారంలోకి వస్తానడం విడ్డూరంగా ఉందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో సర్పంచుల పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని, ఏ ఒక్క హామీని కూడా సమగ్రంగా నిర్వహించకుండా ప్రజలు గుణపాఠం చెప్పిన రజతోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ నిర్వహించారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరని మరోసారి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, లింబాద్రి, మైపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు నరసింహులు యాదవ్, నరసింహారెడ్డి, రాములు, నాయకులు రామచంద్రం, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభ కాదు.. కాంగ్రెస్ పై బురద చల్లె సభ
- Advertisement -