నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా, మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల (గ్రాస్) సాధించినట్టు సమాచారం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అజిత్ కుమార్ కెరీర్‌లో 63వ చిత్రం. ఈ చిత్రంలో అజిత్ మూడు విభిన్న పాత్రలలో (గుడ్, బ్యాడ్, అగ్లీ) నటించారు. తమిళనాడులో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు 2,400 ప్రదర్శనలతో విడుదలై రూ. 28.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.
రూ.100కోట్ల క్లబ్ లోకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
- Advertisement -