Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంవిద్యార్థుల్ని ప్రభుత్వ స్కూళ్ళ వైపు మళ్ళించండి

విద్యార్థుల్ని ప్రభుత్వ స్కూళ్ళ వైపు మళ్ళించండి

- Advertisement -

– టీచర్లకు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలనీ, వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని టీచర్స్‌ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే పీఆర్‌టీయూటీఎస్‌ సంఘం క్షేత్రస్థాయి కార్యకర్తలతో దీనిపై తాను ఫోన్‌ ద్వారా మాట్లాడినట్టు మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొస్తున్న మార్పులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని టీచర్లను కోరారు. ప్రయివేటు విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక వికాసంతో కూడిన విద్యను అందిస్తున్న విషయాన్ని గుర్తించాలనీ, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. నేటితరం విద్యా బోధనకు అనుగుణంగా టీచర్లలో బోధనా పటిమను పెంచుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అందరినీ సమ్మిళితం చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -