అవయవ దానం– జీవన దానం
అక్టోబర్ 7వ తేదీ (మంగళ వారం) బాడీ, అవయవ దానం పై అవగాహన సదస్సు
నవతెలంగాణ – కంఠేశ్వర్
మనిషి చనిపోయిన తర్వాత కూడా తిరిగి జీవించవచ్చని దానికోసం ఏం చేయాలి? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 7వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు పెన్షనర్స్ భవన్ ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఎదురుగా సుభాష్ నగర్ నిజామాబాద్ లో గల జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు సోమవారం తెలిపారు. దీనికి ఎన్నో సంవత్సరాలుగా అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న ప్రముఖు అవయవ దాన ప్రచారకర్తలు హాజరవుతున్నారు. మీరు కూడా తప్పక హాజరు కావాలని, మంచి విజ్ఞాన దాయకమైన ఈ అంశం పై అవగాహన పెంపొందించుకోవడానికి సదస్సుకు రావాల్సిందిగా జనవిజ్ఞాన వేదిక నర్రా రామారావు, కే రామ్మోహన్రావు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్,తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ ఈవీఎల్ నారాయణ లు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
శరీర దానం.. వైద్య విద్యాదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES