Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంస‌మీపిస్తున్న గ‌డువు..ఆప‌రేష‌న్ క‌గార్‌పై అమిత్ షా స‌మీక్ష‌

స‌మీపిస్తున్న గ‌డువు..ఆప‌రేష‌న్ క‌గార్‌పై అమిత్ షా స‌మీక్ష‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ ఏడాది మార్చి31 క‌ల్లా మ‌వోయిష్టు ర‌హిత భార‌త్‌గా రూపొందించాల‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే ప‌చ్చ‌టి అడ‌వుల్లో నెత్తురుపారేందుకు ఆప‌రేష‌న్ క‌గార్ అనే పేరుతో అనేక మంది మావోయిష్టుల‌ను కేంద్ర బల‌గాలు ఎన్ కౌంట‌ర్ చేశాయి.శాంతి చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధంగా ఉన్న‌మ‌ని మావోయిష్టు నేత‌లు తెలియ‌జేసినా.. కేంద్రంలోని మోడీ స‌ర్కార్, చ‌త్తీస్‌గ‌డ్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రించి ఎన్ కౌంట‌ర్లకు మొగ్గుచూపుతున్నాయి. ఈ ఎన్ కౌంట‌ర్‌లో అనేక మంది కీల‌క మావోయిష్టులు నెల‌కొరిగారు.

మ‌రోవైపు మావోయిష్టులపై కొన‌సాగిస్తున్న ఈ ద‌మ‌న‌కాండ‌ను వామ‌ప‌క్షాల‌తో పాటు అనేక పౌర సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. అయినా కూడా మోడీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా కేంద్రం పెట్టుకున్న గ‌డువు ద‌గ్గ‌ర స‌మీపిస్తుండ‌టంతో ఆప‌రేష‌న్ క‌గార్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫిబ్ర‌వ‌రి 7న‌ స‌మీక్ష చేప‌ట్ట‌నున్నారు.ఆ రోజు సాయంత్రం చ‌త్తీస్‌గ‌డ్‌లోని రాయ్‌పూర్‌కు ఆయ‌న‌ వెళ్లనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -