Friday, June 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ గ్రామానికి చెందిన ముదుగుల సాయినాథ్ (40) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ ఐ బిట్ల పెర్సిస్ కధనం ప్రకారం… సాయినాథ్ తన గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్ రుమ్మోల్ల భూమేష్‌తో కలిసి ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ముధోల్ సాయిమాధవ్ నగర్‌లోని ప్రేమల లక్ష్మణ్ ఇంటికి విద్యుత్ పనుల కోసం వెళ్లారు.పని చేస్తుండగా అకస్మాత్తుగా సాయినాథ్‌కు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి, ముధోల్‌కు తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -