Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమద్యం మత్తులో నిద్ర.. వరద నీటితో బెంబేలు

మద్యం మత్తులో నిద్ర.. వరద నీటితో బెంబేలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కుమారచెట్టి గ్రామంలో ఈ నెల 20న అర్ధరాత్రి ఒ ఘటన చోటుచేసుకుంది. స్నేహితులైన ఇద్దరు యువకులు థార్ వాహనంలో గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో నీరు తక్కువగా ఉండటంతో నీటిలోకి వాహనాన్ని తీసుకెళ్లి అక్కడే మద్యం సేవించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే వాహనాన్ని చెరువులోకి తీసుకెళ్లి మద్యం సేవించారు. మద్యం మత్తులో వాహనంలోనే నిద్రలోకి జారుకున్నారు.

అర్ధరాత్రి తర్వాత ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో చెరువులోకి వరద నీరు చేరి నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. వాహనంలోకి నీరు చేరడంతో మత్తు నుంచి తేరుకున్న యువకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాహనంపైకి ఎక్కి సాయం కోసం కేకలు వేశారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని పొక్లెయిన్‌ సాయంతో ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వాహనానికి తాళ్లు కట్టి ఒడ్డుకు లాగారు. ఈ ఘటనలో యువకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువకుల పేర్లు, ఇతర వివరాలు వెల్లడికాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -