- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐక్యరాజ్య సమితి 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్ బృందం అమెరికాకు వచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాల ప్రతినిధులు మూడు గంటలు సమావేశమయ్యారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొన్ని షరతులను యూఎస్ ముందుంచినట్లు తెలుస్తోంది. ఐరాస సమావేశాల్లో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మధ్య సమావేశం జరిగింది. తమ షరతులను తెలిపేందుకే ఈ సమావేశానికి హాజరైనట్లు ఇరాన్ బృందం తెలిపింది.
- Advertisement -


