- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను విడుదల చేసింది. బుధవారం ‘దోస్త్’ వెబ్సైట్లో కాలేజీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను ప్రకటించనున్నారు. గురు, శుక్రవారాల్లో తొలి విడతలో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు ఎయిడెడ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండో విడత ప్రవేశాలు చేపట్టనున్నారు. స్థానికేతర విద్యార్థులకు కూడా స్పాట్ అడ్మిషన్లలో అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
- Advertisement -



