Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంఈసీ చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం

ఈసీ చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం

- Advertisement -
  • శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే

నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో వచ్చిన కథనంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే బుధవారం స్పందించారు. విలేకరుల సమావేశంలో థాకరే మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌, ఎన్నికల సంఘం తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. “గత కొన్ని రోజులుగా, ఎన్నికల కమిషన్‌కు చెందిన జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్ వస్తోంది. జ్ఞానేష్ కుమార్ అసలు స్వరూపం దేశం ముందు బయటపడింది,” అని థాకరే అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, ఓటర్ల జాబితా విధానాలకు సంబంధించిన నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తీరు భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు.

“శివసేన పేరు, గుర్తును ఎన్నికల సంఘం ఆ ద్రోహులకు కట్టబెట్టింది. ఎన్నికలకు ముందు సుమారు 40 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చి, ఎన్నికల తర్వాత వాటిని తొలగించారు,” అని ఆయన ఆరోపించారు. కేవలం “అధికార దాహం” వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని థాకరే ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -