Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారత్‌తో పోరుకు టీ20 జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

భారత్‌తో పోరుకు టీ20 జట్టును ప్రకటించిన న్యూజిలాండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత జట్టుతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోవైపు స్టార్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులోని 13 మంది ఆటగాళ్లను ఈ సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు. అయితే, ఒక ప్రమోషనల్ షూట్‌లో పాల్గొన్నప్పుడు రచిన్ రవీంద్ర కుడి భుజానికి గాయమైంది. దీంతో అతను టీ20 సిరీస్‌లో ఆడటం లేదు. అయితే, ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌ నాటికి అతను కోలుకుని అందుబాటులోకి వస్తాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ పటిష్ఠ‌మైన పేస్ దళాన్ని సిద్ధం చేసింది. జట్టులో ఏకంగా ఏడుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -