- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో గణేష్ విగ్రహాల నిమజ్జన వేడుకల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్థానిక అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బుధవారం విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. బుధవారం ప్రకటించిన సెలవుకు ప్రత్యామ్నాయంగా ఈ రెండు జిల్లాల్లో నవంబర్ 14 (రెండో శనివారం) నాడు స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
- Advertisement -


