- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హాలీవుడ్ నటి హేడెన్ పానెటియర్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటాప్సీ నివేదిక ప్రకారం, ఆమె డ్రగ్స్ ఓవర్ డోస్ తో మరణించినట్లు నిర్ధారణ అయింది. హెడెన్ శరీరంలో ఫెంటానిల్, జనాక్స్ వంటి మత్తు పదార్థాలు గుర్తించారు. 36 ఏళ్ల నటి గత నెల అమెరికాలోని సౌత్ కరోలినాలో తన నివాసంలో మరణించారు. గత ఐదేళ్లుగా ఫెంటానిల్ అనే సింథటిక్ డ్రగ్ వల్ల అమెరికాలో వేలాది మంది మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
- Advertisement -



