Wednesday, September 23, 2026
E-PAPER
Homeఆటలుగట్టెక్కిన అయ్యర్‌సేన!

గట్టెక్కిన అయ్యర్‌సేన!

- Advertisement -

జపాన్‌పై 2 పరుగులతో గెలుపు
శానో (జపాన్) : పసికూన జపాన్‌పై అగ్రజట్టు భారత్‌ కష్టంగా గట్టెక్కింది. ఐదు ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ తొలుత 32/4 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (16, 12 బంతుల్లో 1 ఫోర్‌), సంజు శాంసన్‌ (9, 7 బంతుల్లో 1 ఫోర్‌) రాణించారు. అభిషేక్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (3), తిలక్‌ వర్మ (1 నాటౌట్‌), శివం దూబె (0 నాటౌట్‌) నిరాశపరిచారు. 30 బంతుల భారత ఇన్నింగ్స్‌లో కేవలం రెండు బౌండరీలు మాత్రమే రాగా.. ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేదు. ఊరించే ఛేదనలో జపాన్‌ అద్భుతానికి చేరువైంది. 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ సుందర్‌ (2/13) రెండు వికెట్లు పడగొట్టినా.. జపాన్‌ బ్యాటర్లు లక్ష్యం దిశగా సాగారు. ఓపెనర్‌ ఫ్లెమింగ్‌ (12, 12 బంతుల్లో 1 ఫోర్‌), బెంజమిన్‌ (9 నాటౌట్‌, 8 బంతుల్లో), ఇబ్రహీం (4, 3 బంతుల్లో ఓ ఫోర్‌) పరుగుల వేట సాగించారు. ఆఖరు ఓవర్లలో జపాన్‌కు 9 పరుగులు అవసరం కాగా.. భారత్‌ ఐదు పరుగులే ఇచ్చి ఊపిరీ పీల్చుకుంది. ఆసియా క్రీడల ముంగిట ఆతిథ్య జపాన్‌, భారత్‌ ఏకైక టీ20 మ్యాచ్‌లో గెలుపొందిన అయ్యర్‌సేన సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత్‌ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోగా.. ప్రత్యర్థి ఇంకా ఖరారు కాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -