Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘పెద్దగట్టు జాతర’ మొదలైంది

‘పెద్దగట్టు జాతర’ మొదలైంది

- Advertisement -

ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘పెద్దగట్టు జాతర’ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రంతో విరాన్ష్ హీరోగా డెబ్యూ చేస్తున్నారు. ఎ. రామకృష్ణ రెడ్డి నిర్మిస్తుండగా, విజయ్ కుమార్. సి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టి సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించారు. దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో దేవి ప్రసాద్, మీనా కుమారి, సత్యకృష్ణ, సురేఖా వాణి, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకి డీఓపీ: నాగార్జున, ఆర్ట్ డైరెక్టర్: గిరీష్ దేవాంగ్, లిరిక్ రైటర్స్: కాసర్ల శ్యామ్, సుద్దాల అశోక్ తేజ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -