మాజీ శాసనసభ్యుడు, కె.పి.ఆర్.ఐ.టి విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మాతగా సాయిప్రగతి ఆర్ట్స్ పతాకంపై యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పకులుగా ‘వేదవ్యాస్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . తాజాగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుంది ‘వేదవ్యాస్’ సినిమా యూనిట్. నిర్మాత ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, ‘ దర్శకుడు కృష్ణారెడ్డి సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అని తెలిపారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ,’సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు.
చిత్ర సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ,’మా సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. కృష్ణారెడ్డి ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సినిమాని తెరకెక్కించారు’ అని చెప్పారు.
హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ,’ఈ జనరేషన్‌కి కూడా నచ్చే అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది. ఏఐ జనరేషన్లో కూడా వేదాలు , మన సంస్కృతి గురించిన బ్యాక్‌గ్రౌండ్‌లో కథ ఉంటుంది’ అని అన్నారు.
ఈ తరానికి నచ్చే కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



