కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్, కోన వెంకట్, హరీష్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ,’ తెల్లకాగితం’ అనేది మన మనసుల్లాంటిది. తెల్లకాగితంపై ఏం రాసుకుంటే మన మనసులో అదే ఉంటుంది. ఈ చిత్రాన్ని అందరూ వీక్షించి పెద్ద సక్సెస్‌ను అందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ,’ రోషన్‌కి ‘తెల్ల కాగితం’ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవాలి. హీరోయిన్ నక్షత్ర పేరులోనే స్టార్ ఉంది. నందు ఎంటర్టైన్మెంట్ కాకుండా మంచి ఎమోషన్స్ కూడా రాస్తాడు. ‘తెల్ల కాగితం’లో ఆ ఎమోషన్స్ కనిపిస్తాయి. దర్శకుడిగా నందు అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. దర్శకుడు రమేష్‌కి ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి’ అని చెప్పారు. రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ మాట్లాడుతూ,‘ఇరుముడి’ స్థాయిలో ఈ చిత్రం హిట్ అవుతుంది. నేల మీద నడిచే కథ ఇది’ అని అన్నారు. హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ, ‘తెలిసీ తెలియని ఓ వయసులో చేసే తప్పుల్ని పట్టుకుని ‘తెల్ల కాగితం’ సినిమాని తీశాం’ అని తెలిపారు. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ,’ నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కృష్ణ కి థాంక్స్. ఆయన వల్లే ‘తెల్లకాగితం’ అద్భుతంగా వచ్చింది. మీ లైఫ్, మీరు చేసిన తప్పులు, మీరు చెప్పుకోలేనివన్నీ ‘తెల్లకాగితం’లో ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
స్వచ్ఛమైన ప్రేమ కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



