Monday, April 20, 2026
E-PAPER
Homeసినిమాబాబు మోహన్‌కు రేలంగి అవార్డు

బాబు మోహన్‌కు రేలంగి అవార్డు

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌కి తెలుగు ఫిలిం టెలివిజన్‌ వెల్ఫేర్‌ ఫార్మ్‌, భారత్‌ కల్చరల్‌ అకాడమీ ప్రఖ్యాత రేలంగి అవార్డుతో సత్కరించింది.
సుమారు 2000 చిత్రాలలో నటించి ఆయనకు ఉన్న సామాజిక స్పహతో రాజకీయాలలో అడుగు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా కేబినెట్‌లో సేవలు అందించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్‌, శ్రీ నాగ బాల సురేష్‌, హీరో రాంకీ, నటుడు 30 ఇయర్స్‌ పథ్వి రాజ్‌, సినీ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగ బాల సురేష్‌ మాట్లాడుతూ, ‘అందరి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, గొప్ప గుణం గల బాబు మోహన్‌ ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2000కు పైగా సినిమాలలో నటించిన ఆయనకు రేలంగి అవార్డు రావడం చాలా సంతోషించ దగిన విషయం. ఆయన నటనా రంగంలో, రాజకీయ రంగంలో ఇప్పటికీ ఎన్నో చూసే సారు. ఆయన మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
”నాకు ‘ధర్మయుద్ధం’ చిత్ర సమయంలో పరిచయం అయిన బాబు మోహన్‌ ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగినా, మంత్రిగా పని చేసినా అదే సామాన్య వ్యక్తిత్వంతో ఉన్నారు’ అని తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్‌ చెప్పారు.
బాబు మోహన్‌ మాట్లాడుతూ, ‘నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఆ చిత్రాలలో నా పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -