అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణా నటించిన చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఈ సినిమా జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సుర సుర’ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది సాంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని ప్రజెంట్ చేసే ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ సెలబ్రేషన్ సాంగ్‌గా అలరించింది. అదిరిపోయే బీట్తో పాటు కలర్ ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట చిత్రంలోని సాంస్కతిక నేపథ్యాన్ని, వైభవాన్ని ప్రజెంట్ చేస్తోంది. జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం ట్రైబల్ సౌండ్స్, ఫోక్ ఎలిమెంట్స్‌ను పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది.
అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు తమ తమ ప్రత్యేక వోకల్స్ పాటకు మరింత ఎనర్జీ అందించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాట ఒక విజువల్ స్పెక్టకిల్‌గా ఉంది. విరాట్ కర్ణ తన ఎనర్జీతో కట్టిపడేశారు. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ గ్లామర్‌తో మరింత ఆకర్షణను జోడించారు. ఈ పాట మొత్తం ఒక పెద్ద సంబరంలా, ఆనందోత్సవంలా సాగుతుంది.
ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘నాగబంధం’ పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతోంది.
సాంప్రదాయ పెళ్ళి వేడుకల సంబరం
- Advertisement -
- Advertisement -



