కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సష్టించగా, తాజాగా రష్మిక ఆఫ్ స్క్రీన్ డెడికేషన్ అంచనాలను మరింత పెంచుతోంది అని చిత్ర యూనిట్ అంటోంది.రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మైసా’లో రష్మిక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపించనుంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్‌తో పాటు శారీరక దఢత్వం కూడా అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్‌ని సెట్ చేయనుంది. కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రా, రియల్‌గా అనిపించే యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆమె రోజువారీ శిక్షణ చాలా కఠినంగా సాగుతోంది. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్డ్స్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. ఆమె ట్రైనింగ్ ఫోటోలు చూస్తే సాధారణంగా కనిపించే సాఫ్ట్ నేచర్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా, ఒక దఢ సంకల్పంతో కూడిన యోధురాలిలా కనిపిస్తోంది. త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, సంగీతం: జేక్స్ బిజోరు, డిఓపి: శ్రేయాస్ పి కష్ణ.



