- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బర్త్‌డే పార్టీకి ఆహ్వానించిన స్నేహితులే ఓ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. మార్చి 31న జరిగిన ఈ ఘటనలో మద్యం సేవించిన నలుగురు యువకులు దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఫిర్యాదుతో ఏప్రిల్ 16న కేసు నమోదు చేసి, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
- Advertisement -



